లోకేష్‌ ఓడిపోబోతున్నారు: కాకాణి

లోకేష్‌ ఓడిపోబోతున్నారు: కాకాణి

ఓటమి భయంతోనే ఈసీతోపాటు వైసీపీపై సీఎం చంద్రబాబునాయుడు ఆరోపణలు చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోబోతున్నారని.. అందుకే బాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తించుకోవాలని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోల్చకుని సమీక్షలు నిర్వహించడం సరికాదని అన్నారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా సమీక్ష పెడతాననడంపై కాకాణి స్పందిస్తూ ధాన్యం విక్రయాలు జరుగుతుండటంతో మామూళ్ల కోసమే ఆయన సమీక్ష నిర్వహిస్తామని అంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిన సోమిరెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఓడించనున్నారని అన్నారు.