ఆరు నెలల్లో కాళేశ్వరం పూర్తి చేస్తాం: కేసీఆర్

ఆరు నెలల్లో కాళేశ్వరం పూర్తి చేస్తాం: కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టును ఆరునెలల్లో పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం పూర్తయితే నాలుగు అమృతధారలు వస్తాయి. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్, వరంగల్, నల్లగొండకు నీళ్లొస్తాయి. మానేరు నది 180 కిలోమీటర్ల పొడవుంది. 180 కిలోమీటర్ల మొత్తానికి మొత్తం సజీవ జల దృశ్యంలాగా రాబోయే ఏడాది కాలంలో కనిపిస్తుంది. రాబోయే నాలుగైదు నెలల్లో 260 కిలోమీటర్ల మేర గోదావరి జీవధారగా మారుతుంది. కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ను నింపుతాం. కాళేశ్వరంలో తరగని జల సంపద ఉంది. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రెండు పంటలకు నీరందిస్తాం. 250 కిమీ మేర గోదావరి ఒక సముద్రంలా కనిపిస్తది. రామగుండం దగ్గర గోదావరి 365 రోజులు నిండే ఉంటుంది. అని కేసీఆర్ అన్నారు.