రివ్యూ: కల్కి

రివ్యూ: కల్కి

నటీనటులు: రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, నాజర్‌, అశుతోష్‌ రాణా, శత్రు, సిద్ధు జొన్నల‌గ‌డ్డ, రాహుల్ రామ‌కృష్ణ, చరణ్‌ దీప్‌, పూజిత పొన్నాడ తదితరులు
మ్యూజిక్: శరవణన్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ: దాశ‌ర‌థి శివేంద్ర
నిర్మాత: సి. కల్యాణ్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ  

రాజశేఖర్ గరుడవేగ సినిమాతో రాజశేఖర్ తిరిగి లైన్లోకి వచ్చాడు.  అ వంటి అద్భుతమైన చిత్రాన్ని తీసిన ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి సినిమా చేశారు.  ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దామా.  

కథ : 

అది 1980 వ దశకం... కొల్లాపూర్ అనే గ్రామంలో పెరుమాండ్లుతో కలిసి ఎమ్మెల్యే అశుతోష్ రాణా అరాచకాలకు పాల్పడుతుంటారు.  రోజు రోజుకు వీళ్ళ అరాచకాలు పెట్రేగిపోతుంటాయి.  అయితే, ఎమ్మెల్యే తప్పుడు శేఖర్ బాబు ఊళ్ళో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడు.  ఇంతలోనే శేఖర్ బాబును ఎవరో హత్య చేస్తారు. ఊళ్ళో చెట్టుకు వేలాడదీసి కాల్చివేస్తారు.  దీంతో ఆ ఊర్లో అల్లర్లు చెలరేగుతాయి.  ఈ హత్యకేసును ఛేదించడానికి రాజశేఖర్ ఊర్లోకి వస్తాడు.  రాజశేఖర్ ఆ హత్య కేసును ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

స్క్రీన్ ప్లే ప్రధానాంశంగా సాగే కథ ఇది.  హత్యకేసులోని విషయాలను బయటకు లాగుతుంటే.. దాని చుట్టూ ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి.  హత్యకేసులో పరిశోధన థ్రిల్లింగ్ గా ఉంటుంది.  కేసు మొదట్లో కనిపించిన థ్రిల్లింగ్ రాను రాను తగ్గిపోయింది.  దీంతో సగటు ప్రేక్షకుడు ముందు ఏం జరుగుతుందో ఈజీగా అర్ధం అవుతుంది.  ఫస్ట్ హాఫ్ లో చెప్పడానికి పెద్దగా ఏమి లేకపోవడంతో సాగతీతగా అనిపిస్తుంది.  ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సినిమాకు హైలైట్ గా ఉన్నది.  

ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉన్న ఉత్కంఠ సెకండ్ హాఫ్ లో కనిపించలేదు.  మరలా ప్రీ క్లైమాక్స్ నుంచి ఉత్కంఠతను రేకెత్తించారు.  శేఖర్ బాబును చంపింది ఎవరు అనే విషయం బయటకు వచ్చే సమయంలో సస్పెన్స్ బాగుంది.  సన్నివేశాలు థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి.  చివరి 20 నిమిషాలు సినిమాకు ప్రాణం పోసింది.  

నటీనటుల పనితీరు: 

రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించాడు.  గతంలో పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లోనే రాజశేఖర్ పెర్ఫార్మన్స్ బాగుంది.  రాహుల్ రామకృష్ణ పాత్ర మెప్పించింది.  హీరోయిన్ ఆదా శర్మ గ్లామర్ తో ఆకట్టుకోగా, నందిత శ్వేతా పాత్ర కీలకం.  శేఖర్ బాబుగా నటించిన సిద్దు ఆకట్టుకున్నాడు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

అ సినిమాతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ.. కల్కితో మరోసారి అలరించారు.  స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త పట్టు సాధిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో చెప్పడానికి ఏమి లేకపోవడంతోసాగతీగగా అనిపిస్తుంది.  మొత్తానికి తన రెండో సినిమా గండాన్ని వర్మ దాటాడనే చెప్పొచ్చు.  థ్రిల్లింగ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలకం.  శరవణన్ భరద్వాజ్ ఈ విషయంలో యావరేజ్ గా నిలిచాడు.  దాశరథి శివేంద్ర కెమెరా అక్కడడక్కడా మెప్పించింది.  

పాజిటివ్ పాయింట్స్: 

స్టోరీ 

నటీనటులు 

క్లైమాక్స్ 

నెగెటివ్ పాయింట్స్: 

స్క్రీన్ ప్లే 

ఫస్ట్ హాఫ్ 

చివరిగా: కల్కి - అక్కడక్కడా మెప్పించాడు.