కల్కి టీజర్... విజువల్ వండర్

కల్కి టీజర్... విజువల్ వండర్

రాజశేఖర్ హీరోగా చేస్తున్న కల్కి టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  విజువల్స్ పరంగా కల్కి సూపర్బ్ గా ఉంది.  టీజర్ ఓపెనింగ్ సీన్ చెట్టు కాలుతూ ఉండటం.. డ్రోన్ షాట్స్ లో కొంతమంది నడుచుకుంటూ వెళ్లడం... బాణాలు... నదులు ఇలా సీన్స్ అన్నింటిని క్యూరియాసిటీగా చూపించారు.  

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ కు అనుగుణంగా సూపర్బ్ గా యాప్ట్ అయ్యింది. టీజర్ ఎండింగ్ లో రాజశేఖర్ ను చూపించిన విధానం టీజర్ కు హైలైట్ గా నిలిచింది.  మొత్తానికి యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ టీజర్ తో ఆకట్టుకున్నాడు.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.