రాజ్‌భవన్‌కి కాళోజీ వర్సిటీ వీసీ.. అడ్మిషన్స్‌పై వివరణ..

రాజ్‌భవన్‌కి కాళోజీ వర్సిటీ వీసీ.. అడ్మిషన్స్‌పై వివరణ..

ఎంబీబీఎస్ అడ్మిషన్స్‌లో తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌... ఎంబీబీఎస్ అడ్మిషన్స్‌పై ఆమె ఆరా తీశారు... గవర్నర్ ఆదేశాలతో రాజ్ భవన్‌కు వెళ్లారు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ)  డాక్టర్‌ బి. కరుణాకర్‌ రెడ్డి... అడ్మిషన్స్‌ ప్రక్రియపై గవర్నర్‌కు వివరణ ఇచ్చారు.. కాగా, మెడికల్‌ అడ్మిషన్లలో ఆంధ్ర విద్యార్థులు లబ్ది పొందుతుండగా... తెలంగాణ విద్యార్థులకు మాత్రం అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో ప్రతిభావంతులైన తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు పరిరక్షించాలని గవర్నర్‌ సూచించారు.. అడ్మిషన్స్ పై నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు.