కల్పనా చావ్లా మా హీరో

కల్పనా చావ్లా మా హీరో

అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ, ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా... ఎందరికో ప్రేరణ...  కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో ఆమె మరణించిన ఆమె దృఢమైన సంకల్పం ఎంతోమందికి ఆదర్శం. అయితే కల్పనా చావ్లా అమెరికా హీరోగా అభివర్ణించారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.  ‘ఏషియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐస్‌లాండర్ హెరిటేజ్ మంత్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్... అంతరిక్ష పరిశోధనల కోసం జీవితాన్ని అంకితం చేసిన భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా... అమెరికా వీర మహిళ అంటూ కొనియాడారాయన. వ్యోమగాములు కావాలని లక్షల మంది బాలికల్లో ఆమె స్ఫూర్తి నింపారంటూ కల్పనా చావ్లాపై ప్రశంసల వర్షం కురిపించారు.

స్పేస్‌ షటిల్‌ సహా వేర్వేరు ప్రయోగాల కోసం ఆమె అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు డొనాల్డ్ ట్రంప్... ఇండియన్ అమెరికన్‌ కల్పనా చావ్లా రోదసీలోకి వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ మహిళ.... అంతేకాదు తను అమెరికా హీరో కూడా... స్పేష్ షటిల్ కార్యక్రమాల పట్ల ఎంతో అంకితభావంతో ఉండేవారని... ఎన్నో అంతర్జాతీయ స్పేష్ స్టేషన్ల నుంచి వివిధ రకాలైన కార్గో, సిబ్బంది ప్రయాణ మిషన్లను ఆమె ఆపరేట్ చేసిందన్నారు ట్రంప్. 2003లో స్పేస్‌ షటిల్‌ కొలంబియా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆమెను అమెరికా చట్ట సభలతోపాటు నాసా అనేక పురస్కారాలతో గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు ట్రంప్. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి వచ్చి అమెరికానే సొంత దేశంగా మార్చుకున్నవారితో తమ దేశం ఎంతో లాభపడిందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు.