బీజేపీ వృద్ధ నేతకు పెద్ద పదవి..!

బీజేపీ వృద్ధ నేతకు పెద్ద పదవి..!

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్‌రాజ్‌ మిశ్రా (78)ను నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కల్‌రాజ్‌ మిశ్రా.. గత నరేంద్ర మోడీ కేబినెట్‌లో చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. వయసు పైబడడంతో 2017లో తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ బరిలోకి దిగలేదు. ఇక.. అతి త్వరలోనే 10 రాష్ట్రాల గవర్నర్ల పదవీ కాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.