ఇండియాలో బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇదే..

ఇండియాలో బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇదే..

'2018 ఉత్తమ పోలీస్‌ స్టేషన్లు' జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కింది. కొద్దిసేపటి క్రితం ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. రాజస్థాన్‌‌లోని బికనీర్‌ పరిధిలోని 'కలు' పోలీస్‌ స్టేషన్‌కు మొదటి స్థానం దక్కింది. అండమాన్‌ నికోబార్‌లోని క్యాంప్‌బెల్‌ పోలీస్‌ స్టేషన్‌కు రెండో స్థానం, పశ్చిమ బెంగాల్‌లోకి ముర్షిదాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు మూడో స్థానం దక్కింది. తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్‌కు 14వ స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌కు 20వ స్థానం లభించింది.