కళ్యాణ హరికృష్ణ మాస్ లుక్

కళ్యాణ హరికృష్ణ మాస్ లుక్

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతున్నది.  ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  బయోపిక్ లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించారు.  ఈ పాత్రలో కళ్యాణ్ రామ్ అతికినట్టుగా సరిపోయారు.  కథానాయకుడులో హరికృష్ణ పాత్ర పెద్దగా ఉండకపోవచ్చుగాని, మహానాయకుడు సినిమాలో మాత్రం కీలకంగా మారే అవకాశం ఉంది.  

మొదట బయోపిక్ లో హరికృష్ణ పాత్ర నిడివి కొద్దిగానే అనుకున్నారు.  కానీ, హరికృష్ణ మరణం తరువాత బయోపిక్ లో ఆయన పాత్రపై ఎక్కువ దృష్టిపెట్టారట.  పాత్ర నిడివిని పెంచి హరికృష్ణకు ప్రాముఖ్యతను ఇస్తూ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.  హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ అతికినట్టు సరిపోయారు.  కళ్యాణ్ రామ్ కు సంబంధించిన ఓ లుక్ బయటకు వచ్చింది.  మెరూన్ కలర్ షర్ట్, పైన గుండీలు విప్పి స్టైల్ గా సిగరెట్ తాగుతున్న ఫోటో అది.  ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.