దిల్ రాజుతో కళ్యాణ్ రామ్.. టైటిల్ ఖరారు !

దిల్ రాజుతో కళ్యాణ్ రామ్.. టైటిల్ ఖరారు !

‘ఎంత మంచి వాడవురా’ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ సినిమా ఏదీ ఇంకా విడుదల కాలేదు. కెరీర్లో మాస్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించిన ఈ నందమూరి హీరోకి ఆశించదగ్గ హిట్ రావడం లేదు. అప్పుడెప్పుడో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ‘పటాస్’ సినిమా మినహా ఈ మధ్య కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి.

ప్రస్తుతం కల్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్ విశిష్ట తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‏తో రూపొందుతున్నట్లుగా సమాచారం. అదే సమయంలో దిల్ రాజ్ ప్రొడక్షన్‏లో మరో సినిమా చేయబోతున్నట్లుగా వినిపిస్తుంది. ఈ సినిమాకు ‘డు ఆర్ డై’ అని టైటిల్‏ను కూడా ఫిక్స్ చేసారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిస్తోంది.