మహేష్ లానే కళ్యాణ్ రామ్ కూడా ఆలోచిస్తున్నాడు.. !!

మహేష్ లానే కళ్యాణ్ రామ్ కూడా ఆలోచిస్తున్నాడు.. !!

టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి.  రోజు రోజుకు ఈ టెక్నాలజీ మార్పు చెందుతున్నది.  ఈరోజు చూసిన మార్పు రేపు కనిపించడంలేదు.  ముఖ్యంగా డిజిటల్ రంగంలో.  ఒకప్పుడు సినిమా నిర్మించి రిలీజ్ అయినా సంవత్సరానికి టీవీలో సినిమా వచ్చేది.  ఇప్పుడు అలా కాదు.  ఈరోజు సినిమా రిలీజైతే... పది పదిహేను రోజుల తరువాత డిజిటల్ ఫార్మాట్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో సినిమా ప్రత్యక్షం అవుతున్నది.  నెల రోజులు పూర్తయిందో లేదో.. టీవీ ఛానల్లో సదరు సినిమా వస్తుంది.  

దీంతో థియేటర్స్ లో సినిమా చూడాలనుకునే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది.  డిజిటల్ రంగం అభివృద్ధి చెందాక.. వెబ్ సిరీస్ లు చేయడం ఎక్కువయ్యాయి.  బాలీవుడ్ హీరోలు ఎక్కువగా వెబ్ సీరీస్ లు చేస్తున్నారు.  నిర్మించడమే కాదు.. అందులో నటిస్తున్నారు కూడా.  టాలీవుడ్ నుంచి మొదటగా మహేష్ బాబు వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టాడు.  మహేష్ బాబు సినిమాస్ బ్యానర్లో వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు.  ఈ బాటలో మరో హీరో కళ్యాణ్ రామ్ కూడా చేరబోతున్నాడు.  త్వరలోనే వెబ్ సిరీస్ చేస్తానని చెప్పాడు.  అందులో కళ్యాణ్ నటించడట. నిర్మాతగా మాత్రమే ఉంటాడట.  ఫ్రెష్ లవ్ స్టోరీతో వెబ్ సీరీస్ నిర్మిస్తానని అంటున్నాడు 118 హీరో.