విజేత టీజర్ రివ్యూ 

విజేత టీజర్ రివ్యూ 

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వెండి తెరకు విజేత సినిమా ద్వారా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇది వరకే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా కొద్ది సేపటి క్రితమే టీజర్ రిలీజ్ చేశారు. మరి ఆ టీజర్ ఎలా ఉందొ చూసేద్దామా. 

ఇదొక నిరుద్యోగ యువకుడి కథ అని ఆరంభం నుండే చెప్పేశారు. మనసుకి నచ్చిన పని చేసుకుంటూ బ్రతకడం అందరికి సాధ్యం కాదు. కొంచెం కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి అదే జీవితం. కానీ నిన్ను అలా పెంచలేదు. నా సాయశక్తులా నీకు ఏది ఇష్టమో అదే ఇచ్చాను అంటూ తండ్రి మురళి శర్మ చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ సినిమా ఏంటో చెప్తోంది. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ జర్నీగా ఈ విజేత ఉండబోతోంది. జాలిగా ఉద్యోగం కోసం తిరిగే యువకుడి కథ ఇది. ఇందులో ఏమాత్రం కమర్షియల్ ఎలెమెంట్స్ కి పోకుండా మొదటి సినిమా కాబట్టి డీసెంట్ గా కళ్యాణ్ ను ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ కావడంతో స్క్రీన్ మొత్తం ఫ్రెష్ గా కనిపిస్తోంది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు రాకేష్ రిషికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ టీజర్ లోనే అతని పనితనం కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించారు. జూలై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.