రజనీకాంత్ నిర్ణయంపై కమల్ హాసన్ కామెంట్
రాజకీయ రంగ ప్రవేశంపై డిసెంబర్ 31న ప్రకటన చేస్తానని ప్రకటించిన రజినీకాంత్… తాజాగా ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు. పార్టీ పెట్టకూడదన్న రజనీకాంత్ నిర్ణయం ఆయన అభిమానులలాగే తననూ తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్. అయితే ఆయన ఆరోగ్యమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం తర్వాత రజినీకాంత్‌ను కలుస్తానని చెప్పారు.
రజనీకాంత్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లోకి రాకుండానే ప్రజాసేవ కొనసాగిస్తానని రజనీ లేఖలో స్పష్టం చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)