ఇండియన్ 2 ఆగిపోయినట్టేనా...?

ఇండియన్ 2 ఆగిపోయినట్టేనా...?

శంకర్ 2 పాయింట్ 0 తరువాత గతంలో తన సూపర్ హిట్ సినిమా భారతీయుడుకి సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించాడు.  చాలా కాలం క్రితమే ఈ సినిమా తెరమీదకు రావలసి ఉన్నా కొన్ని కారణాల వలన కుదరలేదు.  ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా స్క్రిప్ట్ ను రెడీ చేసిన శంకర్... సినిమా స్టార్ట్ చేశారు.  ఇండియన్ 2 కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను జనవరి 18, 2019 న రిలీజ్ చేశారు.  ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేయాలి అనుకున్నా.. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే సినిమా ఆగిపోయింది.  

బడ్జెట్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందని వార్తలు వచ్చాయి.  మరోవైపు సార్వత్రిక ఎన్నికలు మొదలు కావడంతో కమల్ హాసన్ తన పార్టీ పనుల్లో మునిగిపోయారని అందుకే సినిమా పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి.  ఎన్నికలకు ముందే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేద్దామని అనుకున్నా వీలు పడలేదు.  దీంతో ఇండియన్ 2 అటకెక్కినట్టే అంటున్నారు.  శంకర్ సినిమాలో నటించే ఛాన్స్ ను కాజల్ మిస్సయిందని చెప్పాలి.