రజనీపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. చేతులు కలుపుతున్నారా..?

రజనీపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. చేతులు కలుపుతున్నారా..?

అవసరమైతే రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, హీరో కమలహాసన్‌. ఒడిషాలోని సెంచూరియన్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్న తర్వాత చెన్నై చేరుకున్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సినీ రంగంలో 44 ఏళ్లుగా రజనీకాంత్, నేను ఇద్దరం కలిసే ఉన్నామన్నారు. మరి.. రాజకీయాల సంగతేంటని ప్రశ్నించగా.. ఏమో అది కూడా జరగొచ్చంటూ ఉత్కంఠ పెంచారు కమల్‌ హాసన్‌. మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని.. తమిళనాడు అభివృద్ధి కోసం తామిద్దరం కలిసి పోరాడతామని తెలిపారు.