తమిళ ఎన్నికలు.. కమల్ బరిలోకి దిగేది అక్కడి నుంచే

తమిళ ఎన్నికలు.. కమల్ బరిలోకి దిగేది అక్కడి నుంచే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మక్కల్‌నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన పోటీ చేయబోయే స్థానాన్ని ప్రకటించారు. ఆయన కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనుండగా, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలైన (ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి) ఏఐఎస్ఎంకే, ఇందియ జయనాయగ కట్చి చెరో 40 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌హాసనేనని ఏఐఎస్ఎంకే చీఫ్ శరత్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.