తమిళనాడులో మొదలైన ఎన్నికల వేడి: కమల్ అక్కడి నుంచే పోటీ...!!

తమిళనాడులో మొదలైన ఎన్నికల వేడి: కమల్ అక్కడి నుంచే పోటీ...!!

ఈ ఏడాది తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి.  తమిళనాడులో ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉండబోతున్నది.  చిన్న చితకా పార్టీలు అన్ని కూడా అన్నాడీఎంకే, డీఎంకే కూటమిలో చేరిపోయాయి.  అయితే, పార్లమెంట్ ఎన్నికలకు ముందు నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని స్థాపించారు.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బరిలోకి దించిన సంగతి తెలిసిందే.  అయితే, అనుకున్న విధంగా రాణించలేకపోయింది.  కాగా, 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కమల్ ఇప్పటికే ప్రకటించారు.  అయితే, అయన ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజక వర్గం నుంచి అత్యధిక ఓట్లు లభించాయి.  దక్షిణ చెన్నైలో కూడా మైలాపూర్ నియోజక వర్గం నుంచే అత్యధిక ఓట్లు లభించడంతో పార్టీ ఆ నియోజకవర్గంపై కన్నేసింది.  మైలాపూర్ నియోజక వర్గం నుంచి మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతున్నది.