దేశంలో మొదటి టెర్రరిస్ట్ హిందువే : కమల్

దేశంలో మొదటి టెర్రరిస్ట్ హిందువే : కమల్

మక్కల్ నీధి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మరోసారి తన సంచలనం వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు.  అరవకురిచి నియోజకవర్గంలో క్యాంపైనింగ్ నిర్వహించిన ఆయన మన దేశంలో  మొట్టమొదటి టెర్రరిస్ట్ గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే.  అతనొక హిందువు.  నేను ఈ మాటల్ని ఇది ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గం అని చెప్పట్లేదు.  గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నాను అన్నారు. 

భారతదేశంలో సమానత్వం ఉండాలని కోరుకునే భారతీయుల్లో నేను ఒకడ్ని.  తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలు చేసిన తప్పుల నుండి ఏమీ నేర్చుకోలేదు అంటూ విరుచుకుపడ్డారు.  కమల్ మాటలకు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా నటుడు వివేక్ ఒబెరాయ్ సైతం అభ్యంతరం చెప్పారు.