కమల్ విశ్వరూపాన్ని చూపించాడు

కమల్ విశ్వరూపాన్ని చూపించాడు

కమల్ హాసన్ నటించి నిర్మించిన చిత్రం విశ్వరూపం.  విశ్వరూపం 1 కి కొనసాగింపుగా వస్తున్న ఈ విశ్వరూపం 2 ట్రైలర్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజయింది.  హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ట్రైలర్ ఉంది.  ఇంటెర్నేషనలో స్థాయిలో టెర్రరిజంపై జరిపే యుద్ధంలా ఉన్నది విశ్వరూపం 2.  కమల్ విశ్వరూపం 2 ట్రైలర్ చూసిన ఎన్టీఆర్ అభిమానులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు.  కమల్ హాసన్ విశ్వరూపాన్ని చూశానని, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.  విశ్వరూపంతో విశ్వనటుడు పేరును సార్ధకం చేసుకున్నాడు కమల్.  ఇక ట్రైలర్ విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నది.   

ఇక విశ్వరూపం 2 సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని విశ్వరూపం 2 సినిమా విడుదలకు సిద్ధమైందని అన్నారు.  ఆగష్టు 10 న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతున్నది.  ఈ సినిమాను అడ్డుకోకుండా చూడాలని అయన విజ్ఞప్తి చేశారు.  ఇక ఈ సినిమాలోని తన మానసిక గురువు బిజూ మహారాజ్ కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.  ఈ సినిమాలోని పాటలు రాజకీయ ప్రస్థానాన్ని సూచించే విధంగా ఉంటాయని చెప్పారు.