కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్ !

కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్ !

కమల్ హాసన్ ఇటీవల ఒక రోడ్ షోలో మాట్లాడుతూ భారతదేశ తొలి ఉగ్రవాది నాథురామ్ గాడ్సే అని, అతనొక హిందువుని అన్నారు.  ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్నే రేపాయి.  హిందూ అతివాదులు మాట విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఇచ్చిన పిర్యాధు మేరకు ఆయనపై అరవకుచ్చి పోలీసులు కేసులు నమోదుచేశారు.  దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైక్రోటును ఆశ్రయించారు.  ఈ కేసులో ఈరోజు మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కమల్ హాసన్‌కు ముందస్తు బెయిలును మంజూరు చేసింది.