అధ్యక్ష పదవికి కమల్ నాథ్ రాజీనామా

అధ్యక్ష పదవికి కమల్ నాథ్ రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.