దుర్గగుడి పాలకమండలి రాజీనామా..

దుర్గగుడి పాలకమండలి రాజీనామా..

విజయవాడలోని కనకదుర్గ గుడి పాలకమండలి మొత్తం రాజీనామా చేసింది... పాలకమండలి చైర్మన్, సభ్యులు మొత్తం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో.. దుర్గగుడి పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసిన పాలకమండలి చైర్మన్, సభ్యులు... తమ రాజీనామా లేఖలను ఎండోమెంట్ ప్రిన్సిపల్ కమిషనర్‌కు ఇవ్వనున్నారు.