సరస్వతీదేవి దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గ 

సరస్వతీదేవి దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గ 

దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. మూలా నక్షత్రంలో అమ్మవారిని  దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున ఒంటి గంటకు సరస్వతి దేవీ దర్శనం ప్రారంభమైంది. క్యూలైన్లు నిండిపోవడంతో దుర్గమ్మ దర్శంనం కోసం భక్తులు రోడ్లపై ఉననారు. తొక్కిసలాట జరుగకుండా భక్తులను విడతలవారీగా పోలీసులు దర్శనానికి పంపుతున్నారు.
సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వసిస్తారు. చదువుల తల్లిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే అమ్మ ఆశీస్సులతోపాటు విద్యాబుద్ధులు వస్తాయని వారి నమ్మకం.