కాలా స్థానంలో నాగ శౌర్య కొత్త సినిమా

కాలా స్థానంలో నాగ శౌర్య కొత్త సినిమా
తెలుగు యువహీరోల్లో నాగ శౌర్య ఒకడు. వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సాధించాడు. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం కణం. ఫిదా ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ నేతృత్వంలో ఈ చిత్రం రూపొందింది. చాలా కాలం క్రితమే షూటింగ్ మొత్తం పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంది. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉండగా..కొని అనివార్య కారణాల చేత వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక చివరికి ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నామని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అధికారికంగా తెలిపింది. ముందుగా ఈ డేట్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా బుక్ చేసుకోగా..తమిళ సినీ పరిశ్రమలో ఏర్పడిన బంద్ దృష్ట్యా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గర్భంలో ఉన్న పిండాన్ని చంపేయగా. అది ఆత్మగా మారితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే ఆసక్తికర కథాంశంతో రూపొందింది. హర్రర్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సాయి పల్లవి నటించడం ఈ చిత్రానికి పెద్ద అసెట్ గా చెప్పొచ్చు.