తెలుగు రాష్ట్రాల్లో లారెన్స్ రచ్చ !

తెలుగు రాష్ట్రాల్లో లారెన్స్ రచ్చ !

లారెన్స్ డైరెక్షన్లో రూపొందే 'కాంచన' ప్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది.  హర్రర్ కంటెంట్ తో పాటు మంచి కామెడీని కూడా అందించే ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.  ఈ క్రేజ్ మీద ఆశలు పెట్టుకునే 'కాంచన 3'ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలచేశారు.  సినిమా మాస్ ప్రేక్షకుల్లో బాగానే ఆడుతోంది.  సింగిల్ స్క్రీన్లలో ఆక్యుపెన్సీ బాగానే ఉంది.  మొదటి మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 9.13 కోట్ల షేర్ రాబట్టుకుంది.