130 కోట్లు కొట్టేసిన లారెన్స్ !

130 కోట్లు కొట్టేసిన లారెన్స్ !

 

గత నెలలో విడుదలైన 'కాంచన 3' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం చిత్రం పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టుకుంది.  తమిళ సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం 130 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది.  స్టార్ హీరోలకు సైతం కష్టతరమైన ఈ వసూళ్లను లారెన్స్ అవలీలగా రాబట్టడం విశేషం.  'ముని, కాంచన' ప్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రాన్ని లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేశారు.  ఇదే ప్రాంచైజీలో లారెన్స్ ఇంకొన్ని సినిమాలు చేయనున్నారు.