ఏ మాత్రం తగ్గలేదు..!!

ఏ మాత్రం తగ్గలేదు..!!

రాఘవ లారెన్స్ తెలుగులో సినిమా చేసి చాలాకాలం అయింది. డ్యాన్స్ మాస్టర్ గా చేస్తూనే.. హీరోగా, దర్శకుడిగా మారిన తరువాత చాలా బిజీ అయ్యాడు.  కోలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో, తన హర్రర్ కామెడీ ఫ్రాంచైసీ ముని సినిమాలోని నాలుగో పార్ట్ ను కాంచన 3 గా రిలీజ్ చేయబోతున్నాడు.  ఈ సినిమా ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోతున్నది. 

తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఫ్రాంచైసీలోని మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  నాలుగో సినిమాపై కూడా నమ్మకం ఉండటంతో తెలుగులో ఠాగూర్ మధు రూ.11 కోట్ల రూపాయలకు రైట్స్ ను దక్కించుకున్నారు.  ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  విజయ్ సర్కార్, అజిత్ విశ్వాసం కంటే ఎక్కువ ధరకు టాలీవుడ్ లో అమ్ముడైన సినిమాగా కాంచన 3 రికార్డు సాధించింది.