కాంచన 3 - డబుల్ హర్రర్

కాంచన 3 - డబుల్ హర్రర్

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న కాంచన 3 సినిమా ఏప్రిల్ 19 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  కాంచన సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది.  రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా ఇది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  ట్రైలర్ చూస్తుంటే ముని సినిమాలోని కొన్ని సీన్స్ చూసినట్టుగా అనిపిస్తుంది. ఎండింగ్ లో డబుల్ అని చెప్పడం వెనుక ఇందులో దయ్యల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అలాగే రాఘవ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారని అర్ధం అవుతున్నది. 

ఇక వైట్ లుంగీ వైట్ షర్ట్ తో పాటు మాసిన గడ్డంతో వయసు పైబడిన వ్యక్తిగా లారెన్స్ కనిపిస్తుండటం విశేషం. ట్రైలర్ భయపెట్టింది.  మరి సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటె తప్పకుండా హిట్ కొట్టినట్టే.