ఓటు వేసేందుకు బారులు తీరిన ముంబై జనం

ఓటు వేసేందుకు బారులు తీరిన ముంబై జనం

నగర ప్రజలకు రాజకీయాలపై అనాసక్తి అని, ఓటు వేయడానికి ఉత్సాహం చూపరనే అపప్రథ ఉంది. కానీ దీనిని వమ్ము చేశారు ముంబై ఓటర్లు. ఉత్తర ముంబై నియోజకవర్గంలోని కాందీవలిలో ఓటు వేయడానికి ఓటర్లు కిలోమీటర్ల మేర బారులు తీరారు. తమ వంతు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి ఓటు వేస్తున్నారు. ఉత్తర ముంబై లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మాతోండ్కర్ సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియో క్లిప్స్ షేర్ చేశారు. వీటిలో పోలింగ్ బూత్ లకు వెళ్తున్న ఓటర్ల హడావిడితో పాటు కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం ఉన్నారు. ఈ వీడియోలు పోస్ట్ చేసిన ఊర్మిళ, వీళ్లంతా ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి మార్పు కోరుకుంటున్న జనం తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.