న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు నోటీసులు

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు నోటీసులు

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌కు నోటీసులు జారీ చేసింది ఐసీసీ. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓటమిపాలైన పర్యాటక జట్టుకు మరో షాకిచ్చింది ఐసీపీ. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ చేసిన బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందంటూ ఫిర్యాదు అందడంతో దీనిపై వెంటనే స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. విలియమ్సన్‌కు నోటీసులు ఇచ్చింది. ఇక, విలియమ్సన్‌తో పాటు శ్రీలంక బౌలర్ ధనుంజయ బౌలింగ్  శైలిపై కూడా మ్యాచ్ రిఫరీ అనుమానం వ్యక్తం చేస్తూ.. వీరిద్దరి బౌలింగ్ శైలి అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు లోబడి ఉందో? లేదో? పరిశీలించాల్సిందిగా ఐసీసీని కోరాడు. దీనిపై స్పందించిన ఐసీసీ.. 14 రోజుల్లో తమ ముందు హాజరవ్వాల్సిందిగా వీరిద్దరికి నోటీసులు జారీ చేసింది. నిపుణుల సమక్షంలో వీరిద్దరి బౌలింగ్ శైలిని పరిశీలించనుంది ఐసీసీ.