ఆ నలుగురు క్రికెటర్ల నుండి అప్పు తీసుకోవాలనుకుంటున్న విలియమ్సన్...

ఆ నలుగురు క్రికెటర్ల నుండి అప్పు తీసుకోవాలనుకుంటున్న విలియమ్సన్...

క్రికెట్ యొక్క ప్రతి తరం వారి నైపుణ్యాలతో అభిమానులను ఆకట్టుకునే అద్భుతమైన ఆటగాళ్ళను ముందుకు తెస్తుంది. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ, కొంతమంది ఆటగాళ్ళ యొక్క కొన్ని నైపుణ్యాలను అప్పుగా  తీసుకోవాలనుకుంటున్నాడు. విలియమ్సన్ మాట్లాడే మొదటి ఆటగాడు మరెవరో కాదు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. విలియమ్సన్ కోహ్లీ యొక్క బ్యాటింగ్ పద్ధతిని తీసుకోవాలనుకుంటున్నాడు విలియమ్సన్. భారత కెప్టెన్ ఎల్లప్పుడూ పరుగులు చేయడంపై దృష్టి పెడతాడు అని తెలిపాడు. తరువాత బాబర్ ఆజం నుంచి కవర్ డ్రైవ్‌లు, బ్యాక్-ఫుట్ పంచ్‌ల నైపుణ్యాలను తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. స్టీవ్ స్మిత్ నుండి ఆటగాళ్ల మధ్య గ్యాప్ కనుగొనే నైపుణ్యాన్ని పొందాలనుకుంటున్నాడు. చివరగా, న్యూజిలాండ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతాడు... అతనికి మంచి బ్యాక్ ఫుట్ ప్లే సామర్థ్యం ఉంది ఈ నైపుణ్యం కలిగి ఉంటే ఏ బాట్స్మెన్ కు అయిన ప్రయోజనం కాబట్టి దానిని తీసుకోవాలనుకుంటున్నాను అని తెలిపాడు.