బాలీవుడ్ పై కంగనా యుద్ధం..!!

బాలీవుడ్ పై కంగనా యుద్ధం..!!

కంగనా రనౌత్ మెయిన్ లీడ్ రోల్ చేసిన మణికర్ణికా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఆ సినిమా బాగుందనే టాక్ వచ్చినా.. సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో.. సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.  మొదట ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు.  మధ్యలో సినిమా నుంచి తప్పుకోవడంతో.. కంగనా మిగతా సినిమా ఫినిష్ చేసింది.  ఎప్పుడైతే క్రిష్ తప్పుకున్నాడా అప్పటి నుంచే సినిమాపై కామెంట్లు మొదలయ్యాయి.  ఈ కామెంట్స్ అన్నింటిని కంగనా తిప్పికోట్టింది. 

సినిమాను సవాల్ గా తీసుకొని పూర్తి చేసింది.  కంగనా సినిమా తీసిన విధానంపై చాలా విమర్శలు వచ్చాయి.  అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదు.  ముక్కుసూటిగా పోయే తత్త్వం కంగనా సొంతం.  అందుకే ఏ విషయాన్నైనా స్ట్రెయిట్ గా మాట్లాడుతుంది.  ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురొడ్డి నిలుస్తుంది కంగనా. కంగనను విమర్శించే వారిపై యుద్ధం మొదలుపెట్టింది. 31 సంవత్సరాల వయసులోనే 3 జాతీయ అవార్డులు గెలుచుకోవడం తనలో ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పిన కంగనా.. అవసరమైతే బాలీవుడ్ పై యుద్ధం చేయడానికైనా సిద్దమే అంటోంది.