కంగనకు కోర్టు నోటీసులు.. కారణం అదే..

కంగనకు కోర్టు నోటీసులు.. కారణం అదే..

వివాదాల రాణిగా పేరు తెచ్చుకు కంగనా రనౌత్‌కు ఇటీవల కోర్టు నోటీసులు వచ్చాయి. అయితే ఇవి ఏ రాజకీయాలు సంబంధించినవో, మరొకటో కాదు. కంగనా చేయనున్న తదుపరి చిత్రం గురించి ఈ నోటీసులు వచ్చాయి. కంగనా తన పాత సినిమా మణికర్ణి సినిమాకు సీక్వెల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ‘మణికర్ణిక.. ది లెజెండ్ ఆఫ్ దిద్దా’ అనే పేరుతో రూపొందించనుంది. ఈ సినిమాను కాశ్మీరీ రాణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించనున్నారు. దాంతో అమ్మడిని సవాల్ చేస్తూ ఆశిష్ అనే వ్యక్తి లీగల్ నోటీసులు పంపారు. ఆశిష్ ఎవరు అనుకుంటున్నారు. అతడొక రచయిన కాశ్మీరీ రాణి ‘దిద్దా.. కాశ్మీర్‌కి యోధా రాణి’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ 2017 లో రిలీజ్ అయింది. దాంతో కాశ్మీరీ రాణి దిద్దా జీవిత గాథకు సంబంధించిన అన్ని హక్కులు తను కలిగి ఉన్నాడట. దాంతో అతడి అనుమతి లేకుండా రాణి జీవిత చరిత్రను ఎలా చిత్రీకరిస్తారిని ఆశీష్ వాదిస్తున్నాడు. దాంతో ఈ మేరకు కోర్టును ఆశ్రయించాడు. దాంతో కంగనకు కోర్టు నోటీసులు వచ్చాయి. మరి ఈ విషయంలో కంగనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.