కంగనా ధాకడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

కంగనా ధాకడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ బ్యూటీ కంగనా వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ షెడ్యూల్ గడుపుతోంది. ఈ అమ్మడు తాజాగా జయలలిత జీవిత కథ నేపథ్యంలో తలైవి అనే సినిమాను చేసింది. ఈ సినిమా చిత్రీకరణ కొన్నాళ్ల క్రితమే పూర్తయింది. వెంటనే వివాదాల రాణి కంగనా తన తదుపరి చిత్రాన్ని మొదలు చేసింది. ఈ సినిమాకి ధాకడ్ అనే పేరును ఖరారు చేశారు. లేడీ ఓరియాంటెడ్‌గా సాగె యాక్షన్ సినిమా అని కంగనా స్వయంగా తెలిపింది. అంతేకాకుండా భారత్‌లోని ఉత్తమ చిత్రాల్లో ఇదికూడా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందులోని యాక్షన్ సన్నివేశాల కోసం కంగనా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. ఈ సినిమా రజనీష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిమోహ్ చక్రవర్తి, మనోజ్ తివారీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ విషయాన్ని కంగనా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ రేంజ్‌లో రూపొందించనున్నారని, ఇందులో కంగనా తన నట విశ్వరూపం చూపించిందని టాక్ వస్తుంది. ఇప్పటికే విడదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.