ట్విట్టర్‌ సీఈఓని విడిచిపెట్టని కంగనా

ట్విట్టర్‌ సీఈఓని విడిచిపెట్టని కంగనా

ఎవ్వరు ఏమనుకున్నా సరే తన మనసులోని మాటలను కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతుంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ప్రతిరోజు ఏదోవొక స్టేట్మెంట్, కామెంట్స్ తో ట్రెండ్ లో ఉంటున్నారు కంగనా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాకి మాత్రం దూరంగా ఉండటం ఆమెకు చాలా కష్టంగా మారిందనే చెప్పాలి. తాజాగా ట్విట్టర్‌ సీఈఓని కంగనా టార్గెట్‌ చేసింది.ఇప్పటికే కంగనా తన ట్వీట్లపై చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తోంది. ఆమెను తట్టుకోలేక ట్విట్టర్‌ ఇండియా కంగనా ఖాతాను షాడోబ్యాన్‌ చేసినట్లుఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కంగనా ట్విట్టర్‌ సీఈఓపై ఆగ్రహానికి లోనైయింది. ‘ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని ‘జాక్‌ చాచా’ అని కామెంట్స్ చేస్తూ.. నేను ఫాలోయర్స్‌ని పెంచుకోవడానికో.. నన్ను నేను ప్రమోట్‌ చేసుకోవడానికో నేను సోషల్ మీడియా వేదికకు రాలేదు. భావ వ్యక్తీకరణలో నేను ఏది మాట్లాడినా అది దేశం కోసమే. దాన్ని వారు సహించలేకపోతున్నారు. నా ఆలోచనలను వ్యక్తికరణ చేసినందుకు జాక్‌ అండ్‌ అతని బృందం నా ఖాతాను షాడోబ్యాన్‌ చేశారు. వారు నన్ను చూసి భయపడుతున్నారు. వారు నన్ను బ్యాన్‌ చేయలేరు. అలాగని నన్ను ఉంచడానికి అనుమతించలేరు’ అని కంగనా తన ట్వీట్‌లో తెలిపింది.