కంగనాకు వై-ప్లస్ భద్రత...ఇలా స్పందించిన కిషన్ రెడ్డి..!

 కంగనాకు వై-ప్లస్ భద్రత...ఇలా స్పందించిన కిషన్ రెడ్డి..!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వై-ప్లస్ భద్రత నడుమ ముంబైలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కంగనా రనౌత్ తండ్రి చేసిన అభ్యర్థనపై ఆమెకు వై-ప్లస్ భద్రత కల్పించినట్టు పేర్కొన్నారు. కంగనా తండ్రి తన కుమార్తెకు వై సెక్యూరిటీ కల్పించాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్  కి లేఖ రాయడమే కాకుండా వ్యక్తిగతంగా కలిసి ఓ మెమోరాండం కూడా సమర్పించారని తెలిపారు. తన కూతురును మహారాష్ట్ర లో వేధింపులకు గురిచేస్తారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు వెల్లడించారు. దాంతో కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలతో కంగనాకు 10 మంది సాయుధ కమెండోలతో వై-ప్లస్ భద్రత కల్పించినట్టు కిషన్ రెడ్డి విమరించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఆఫీస్ ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె శివసేనను సవాల్ చేస్తూ ముంబైలో సెక్యూరిటీ మధ్య అడుగుపెట్టింది. ఇక కంగన చేసిన పనికి ప్రశంసలతో పాటూ విమర్శలు కూడా ఎదురౌతున్నాయి.