కంగనా రూ.100 కోట్లు కొట్టేసింది..!!

కంగనా రూ.100 కోట్లు కొట్టేసింది..!!

కంగనా రనౌత్ నటించిన మణికర్ణికా సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  సినిమా బాగున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం వెనకబడింది.  దర్శకుడు క్రిష్ పక్కకు తప్పుకోవడం.. విలన్ రోల్ ప్లే చేసిన సోనూసూద్ ను తప్పించడంతో పాటు స్క్రిప్ట్ లో మార్పులు చేసి కంగనా దర్శకత్వం బాధ్యతలు తీసుకోవడంతో.. సినిమాపై అనుమానాలు ఏర్పడ్డాయి.  

ట్రైలర్ తరువాత సినిమా బాగుందనే వచ్చినా...తగినంత పబ్లిసిటీ చేయలేదు.  సినిమా రిలీజ్ తరువాత కూడా తగినంత పబ్లిసిటీ చేయకపోవడంతో సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయాయి.  చాలామందికి అసలు మణికర్ణికా సినిమా వస్తుందనే సంగతి తెలియలేదు.  కనీసం రూ.70 లేదా రూ.80 కోట్లయినా వస్తాయా అనుకుంటే.. ఎట్టకేలకు లాంగ్ రన్ లో రూ.100 కోట్లు వసూలు చేసింది.  మణికర్ణిక సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ కావడం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది.