మణికర్ణిక టీజర్ రెడీ.. అభిమానుల్లో టెన్షన్..

మణికర్ణిక టీజర్ రెడీ.. అభిమానుల్లో టెన్షన్..

మణికర్ణిక సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుంచి అన్ని అవాంతరాలు ఎదురౌతూనే ఉన్నాయి.  సినిమాను దాదాపుగా ఫినిష్ చేసి.. కొన్ని మార్పులు చేర్పులు చెప్తూ.. దర్శకుడు క్రిష్ ఆ బాధ్యతను టైటిల్ రోల్ పోషిస్తున్న కంగనాకు అప్పగించాడు.  క్రిష్ నుంచి బాధ్యతలు తీసుకున్న కంగనా.. సినిమాను, యూనిట్ ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది.  అందులోని చాలా సీన్స్ ను రీషూట్ చేసేందుకు సిద్ధం కావడంతో.. నటుడు సోనూ సూద్ వ్యతిరేకంచాడు.  దీంతో ఆయనను సినిమా నుంచి పక్కకు తప్పించి ఆ సీన్స్ ను కట్ చేసిందట.  దీంతో కంగనా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.  

మణికర్ణికలో ఏం జరుగుతున్నదో అర్ధంగాక అయోమయంలో ఉన్న స్థితిలో అసలు సినిమా అనుకున్నట్టుగా జనవరి 25 న రిలీజ్ అవుతుందా కాదా అనే సందిగ్ధంలో పడిపోయారు నిర్మాతలు.  దర్శకత్వం బాధ్యతలను స్వీకరించిన కంగనా.. సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామని భరోసా ఇవ్వడంతో నిర్మాతలు అదనపు బడ్జెట్ పెట్టేందుకు ముందుకు వచ్చారు.  మణికర్ణిక నిర్మాణంలోకి జీ5 సంస్థ ఎంటర్ కావడంతో.. సినిమాపై మరలా ఆశలు చిగురించాయి.  ఇప్పుడు ఈ సినిమాగురించి మరో న్యూస్ బయటకు వచ్చింది.  మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 న మణికర్ణిక టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక టెన్షన్ ఉంటె.. ఇప్పుడు టీజర్ ను కంగనా ఎలా కట్ చేసిందో అని ఆమె అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.