వన్ విమెన్ షో..!!

 వన్ విమెన్ షో..!!

తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించుకున్న రోజుల్లో అనేక యుద్దాలు జరిగాయి.  ముఖ్యంగా మొదటి స్వతంత్ర పోరాటం.  ఈ పోరాటంలో ఝాన్సీ రాజ్యానికి అధిపతిగా ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన  పోరాటం దేశం ఉన్నంత కాలం గుర్తుంచుకుంటుంది.  ఝాన్సీ లక్ష్మీబాయిని వీర పుత్రికగా పేర్కొంటారు.  

ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు మణికర్ణిక అనే సినిమా తెరకెక్కుతున్నది. కంగనా రనౌత్ ఇందులో హీరోయిన్, హీరో కూడా.  ఈ సినిమాను మొదట క్రిష్ దర్శకత్వం వహించగా.. కొన్ని కారణాల వలన మధ్యలో పక్కకు తప్పుకుంటే.. ఆ ప్లేస్ లో కంగనా రనౌత్ దర్శకత్వం వహించి సినిమా పూర్తి చేసింది.  ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే.. అంతా కంగనానే కనిపించింది.  ఆమె వీరోచిత పోరాటాలే కనిపిస్తాయి. క్వీన్ గా మెరుపులు మెరిపించి కంగనా.. వీరనారిగా ఖడ్గధారణ చేసి రాజ్యం కోసం పోరాటం చేసిన తీరు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  బాహుబలి, భజరంగి భాయ్ జాన్ వంటి సినిమాలకు కథలు అందించిన విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు. రిపబ్లిక్ డే రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.