ఆ విషయంలో కంగనా మళ్ళీ వివాదం తెస్తుందా..?

ఆ విషయంలో కంగనా మళ్ళీ వివాదం తెస్తుందా..?

కంగనా రనౌత్.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ తో పాటు, వివాదాస్పద హీరోయిన్ గా కూడా గుర్తింపు పొందింది.  మణికర్ణికా సినిమాలో సగం భాగం ఆమెనే దర్శకత్వం వహించింది.  క్రిష్ ను పక్కన పెట్టి తానే దర్శకత్వం చేయడంతో.. అప్పట్లో పెద్ద వివాదం జరిగింది.  సినిమా విజయం సాధించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.  

ఇప్పుడు కంగనా మెంటల్ హై క్యా సినిమా చేస్తోంది.  ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.  ఈ సినిమాలో చాల సీన్స్ కు కంగనా దర్శకత్వం వహించిందట.  సినిమా బాగారావాలనే ఉద్దేశ్యంతో కంగనా సూచనలు ఇస్తూ దర్శకత్వం చేస్తే తప్పేంటని అంటున్నాడు దర్శకుడు.  ఎవరు చేసిన ఫైనల్ గా ఫలితం రావాలని.  సినిమా హిట్ కావలన్నదే లక్ష్యం అని అంటున్నాడు ప్రకాష్ కోవెలమూడి.