కర్ణిసేనపై మణికర్ణిక ఫైట్

కర్ణిసేనపై మణికర్ణిక ఫైట్

కంగనా రనౌత్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న మణికర్ణిక సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.  రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా పొందింది.  రేపు రాష్ట్రపతి సమక్షంలో స్పెషల్ షో చూడబోతున్నారు.  ఈ సమయంలో కర్ణిసేన ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  

కర్ణిసేన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందించింది.  రాణి లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాను అడ్డుకోవాలని చూసేవారికి భంగపాటు తప్పదని వార్నింగ్ ఇచ్చింది.  తాను రాజపుత్ నే అని అవసరమైతే తానుసైతం రంగంలోకి దిగుతానని చెప్పింది.  దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.  విడుదలకు మరోవారం రోజులు సమయం ఉండటంతో ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.