జయలలిత బయోపిక్ కోసం కంగన ఎంత డిమాండ్ చేసిందో తెలుసా.?

జయలలిత బయోపిక్ కోసం కంగన ఎంత డిమాండ్ చేసిందో తెలుసా.?

అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా ఐరన్ లేడీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో జయలలిత పాత్రకోసం అనేకమంది పేర్లను పరిశీలించి చివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ ను ఎంపిక చేశారు.  ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటె, జయలలిత బయోపిక్ కోసం కంగనా ఏకంగా రూ.24 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.  ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు సుముఖంగా ఉన్నారట.  కంగనాకు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉండటంతో.. సినిమా ఈజీగా సక్సెస్ అవుతుందని, పెట్టిన డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదని నిర్మాతల ఆలోచన.