కంగనా రివర్స్ పంచ్.. అయోమయంలో మీడియా

కంగనా రివర్స్ పంచ్.. అయోమయంలో మీడియా

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వరసగా సినిమాలతో ఎలాగైతే దూసుకు పోతున్నదో... అంతే దూకుడుగా వివాదాల్లో చిక్కుకుంటోంది.  ఇటీవల జడ్జిమెంటల్ హై క్యా సినిమా ప్రెస్ మీట్ లో ఓ విలేకరిపై కంగనా విరుచుకు పడింది. ఇలా విరుచుకు పాడటానికి ఓ కారణం ఉంది.  గతంలో సదరు విలేఖరి కంగనా సినిమా గురించి తప్పుగా రాశారట.  

పైగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా సద్గురుతో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా దేశానికీ సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నది.  కానీ, వాటిని కించపరుచు ఫన్ గా రాయడంతో ఆమెకు ఒళ్ళు మండింది. ఇలాంటి వార్తలు రాసేవాళ్ళు విలేఖరులు అని ఎలా చెప్పుకుంటారో అని మండిపడింది.  మొన్న జరిగిన విలేఖరుల సమావేశంలో జరిగిన గొడవలో... కంగనా సినిమాలకు మీడియా ప్రోత్సహించకూడదని.. ఆమె సినిమాలను బ్యాన్ చేయాలని విలేఖరులు డిమాండ్ చేశారు.  

దీనిపై కంగనా రివర్స్ పంచ్ వేసింది.  తనను మీడియానుంచి బహిష్కరించాలని, తన ద్వారా వచ్చే వార్తలతో వారి వారి కుటుంబాల పోషణ జరగడం ఇష్టం లేదని చెప్పింది.  దీనికి సంబంధించిన చిన్న వీడియోను తన సోదరి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.  ఈ పోస్ట్ కొద్దీ సేపట్లోనే వైరల్ గా మారింది.