మహేష్ బాబు సినిమాను మిస్ చేసుకుందట

మహేష్ బాబు సినిమాను మిస్ చేసుకుందట

మహేష్ కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఒకటి పోకిరి.  పూరి జగన్నాధ్ మహేష్ కాంబినేషన్లో 2006 వ సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ఇల్లి బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా తరువాత ఇలియానా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగింది.  కాగా, ఈ సినిమాలో మొదట నటించే అవకాశం కంగనా రనౌత్ కు వచ్చిందట.  ఈ విషయాన్ని కంగనానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

ఐ లవ్యూ బాస్ అనే సినిమా సమయంలో కంగనా మొదటిసారిగా ఆడిషన్స్ కు వెళ్లి చాలా ఇబ్బందులు పడినట్టు తెలిపింది.  ఎలాగో ఆడిషన్స్ పూర్తి చేసుకున్నాక, నచ్చక సినిమా చేయలేదు.  ఆ తరువాత గ్యాంగ్ స్టర్ సినిమా ఆడిషన్స్ కు వెళ్లినట్టు తెలిపింది.  అదే సమయంలో పూరి జగన్నాథ్ పోకిరి ఆడిషన్స్ జరుగుతుంటే వాటికి కూడా హాజరైనట్టు తెలిపింది.  గ్యాంగ్ స్టర్, పోకిరి రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా.. పోకిరి మిస్ చేసుకున్నట్టు తెలిపింది.  ఆ తరువాత పూరి జగన్నాథ్ ఏక్ సినిమాలో నటించే అవకాశం దక్కినట్టు కంగనా చెప్పింది.  ఒకవేళ పోకిరిలో నటించి ఉంటె టాలీవుడ్ లో తనకు ఒక మంచి గుర్తింపు వచ్చేదని చెప్పింది కంగనా.