జయలలిత బయోపిక్ కోసం కంగనా ఏం చేస్తున్నదో తెలుసా?

జయలలిత బయోపిక్ కోసం కంగనా ఏం చేస్తున్నదో తెలుసా?

తమిళనాడు రాజకీయాలను శాసించిన వ్యక్తుల్లో పురుచ్చితలైవి జయలలిత ఒకరు.  సినిమా రంగంలో రాణించిన తరువాత రాజకీయాల్లోకి వచ్చి.. ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అమ్మ మరణించింది. 

ఇప్పుడు అమ్మ జీవితం ఆధారంగా అనేక సినిమాలు తమిళనాడులో తెరకెక్కబోతున్నాయి.  అందులో ఒకటి ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఐరన్ లేడీ ఒకటి.  బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు.  కొన్ని నెలలపాటు అమ్మ జీవితం గురించి పరిశోధన చేసి కథను సిద్ధం చేశారు.  ఇందులో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న సంగతి తెలిసిందే.  తమిళంలో ఆమెకు ఇది మొదటి సినిమా.  జయలలితకు దగ్గరి పోలికలు ఉండటంతో ఆమెను తీసుకున్నారు.  

అమ్మ సినిమా కోసం జయలలిత తమిళం నేర్చుకోవడానికి సిద్ధం అయింది. పాగల్ హై క్యా సినిమా తరువాత తమిళం నేర్చుకుంటుందట.  పాత్రను అర్ధం చేసుకోవాలంటే భాష తప్పని సరి కావడంతో కంగనా ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ సినిమాను జయ పేరుతో బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తారట.