దీపికా పదుకునే ఒక సైకో.. కంగనా సంచలన కామెంట్లు

దీపికా పదుకునే ఒక సైకో.. కంగనా సంచలన కామెంట్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద స్టార్ ను అయినా కూడా కంగనా రనౌత్ తనదైన శైలిలో తీసి పక్కన పెట్టేసేలా మాట్లాడుతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో సగం మంది స్టార్స్ తో ఈమెకు సరైన అనుబంధం లేదనే టాక్ ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెపోటిజం పై కంగనా ఘాటుగానే స్పందించింది. ప్రముఖులందరిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసిన  కంగనా. తాజాగా స్టార్ హీరోయిన్ దీపికాపదుకునే పై విమర్శలు చేసింది. ఆమె ఒక సైకో అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాదు యంగ్ హీరో రణబీర్ కపూర్ ఒక రేపిస్ట్ అంటూ వ్యాఖ్యలు చేసింది. 'ప్రతిరోజు అమ్మాయిల వెంట పడే రణబీర్ ను ఎవరూ రేపిస్ట్ అని పిలవరని కంగన చెప్పింది. తనను తాను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా దీపిక ప్రకటించుకుందని... అయినప్పటికీ ఆమెను ఎవరూ సైకో, రాక్షసి అని పిలవరని విమర్శించింది. సాధారణ కుటుంబాల నుంచి, చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి మాత్రం ఇలాంటి పేర్లు పెడతారని కంగనా మండిపడింది.