క్రిష్ పై విరుచుకుపడ్డ కంగనా సిస్టర్ !

క్రిష్ పై విరుచుకుపడ్డ కంగనా సిస్టర్ !

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'మణికర్ణిక' చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.  ఈ సందర్బంగా దర్శకుడు క్రిష్  ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ సినిమాను కంగనా డైరెక్ట్ చేసింది 35 శాతమేనని, ఎక్కువ భాగం తానే చిత్రీకరించానని చెప్పుకొచ్చాడు.  దానికి సమాధానంగా కంగనా సోదరి, మేనేజర్ రంగోలి 'క్రిష్.. మీరే డైరెక్ట్ చేశారు.  ప్లీజ్ కామ్ డౌన్.  అయినా సినిమాకు లీడింగ్ ఫేస్ కంగనానే.  ఈ విజయాన్ని, ప్రశంసల్ని ఆమెను ఆస్వాదించనివ్వండి' అంటూ ఘాటైన ట్వీట్ చేసింది.  పలువురు నెటిజన్లు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.