జయలలిత బయోపిక్ లో కంగనా

జయలలిత బయోపిక్ లో కంగనా

అమ్మ పురచ్చితలైవి జయలలిత పేరుతో తమిళనాడులో మూడు నాలుగు బయోపిక్ లు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.  వీటిల్లో ఏ ఎల్ విజయ్ అనే దర్శకుడు ఐరెన్ లేడీ పేరుతో బయోపిక్ తీసేందుకు సిద్ధం అయ్యారు.  ఈ సినిమాలో అమ్మ పాత్ర కోసం అనేకమంది పేర్లను పరిశీలించారు.  కాగా, ఫైనల్ గా బాలీవుడ్ క్వీన్, మణికర్ణికా హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ లీడ్ పాత్రకు ఎంపికైంది.  

కొద్దిసేపటి క్రితమే ఈ న్యూస్ ను అధికారికంగా ప్రకటించారు.  అమ్మ బయోపిక్ ను అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.  అమ్మ బయోపిక్ లో క్వీన్ కంగనా ఎలా సెట్ అవుతుందో చూడాలి.