జగన్‌ సర్కార్‌కు 6 నెలల డెడ్‌లైన్..!

జగన్‌ సర్కార్‌కు 6 నెలల డెడ్‌లైన్..!

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌కు ఆరు నెలల డెడ్‌లైన్ పెట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. కాకినాడలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు పెద్ద తేడా లేదన్న ఆయన.. జగన్ సర్కార్‌కు ఆరు నెలల సమయం ఇస్తామని.. తీరు మారకపోతే రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వాలు ఉండాలని సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడ్డారు కన్నా..  ప్రభుత్వం అన్నాక కులాలు, మతాలకు అతీతంగా పాలన అందించాలని వ్యాఖ్యానించారు. కానీ, జగన్ సర్కార్ అలా ప్రవర్తించటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.