'బాబు తుమ్మినా మోడీ కుట్రేనా?'

 'బాబు తుమ్మినా మోడీ కుట్రేనా?'

చట్టాన్ని తన చుట్టంగా వాడుకుంటున్న వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇవాళ గుంటూరులో ఆయన మాట్లాడుతూ 'ఆపరేషన్‌ గరుడ'కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌ చంద్రబాబేనని అన్నారు. 'ఆపరేషన్ గరుడ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి గరుడలు, పెరుగు వడలు చాలా వస్తాయి' అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తుమ్ము వచ్చినా మోడీ కుట్ర అనే పరిస్థితి నెలకొందన్న కన్నా..  పత్రికల్లో మోడీపై వచ్చే ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.